Wednesday, June 24, 2020

By Subrahmanyam M

మన ఆరాధ్యకుటుంబాలలోని కళాభిమానులందరకు శుభాభినందనలు.

కళాతపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారు, గానగంధర్వుడు శ్రీపతిపండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యమ్ గారు, ప్రముఖ నటులు మల్లంపల్లి చంద్రమోహన్ గారు మన ఆరాధ్యులవడం మనకు గర్వకారణం.

ముదిగొండ శివప్రసాదుగారివంటి నవలా రచయితలు, చాగంటి కోటేశ్వరరావుగారివంటి ప్రవచనకారులు మనమధ్యయుండడం మన అదృష్టం.

మన ఆరాధ్యులలో ఎంతోమంది ఎన్నో రంగాలలో ప్రసిద్ధిపొందియున్నారు.

అలాగే, గతంలోనూ, కాశీనాధుని నాగేశ్వరరావుపంతులుగారు, కాశీనాధుని పూర్ణమల్లికార్జునుడుగారు, ముదిగొండ లింగమూర్తిగారు, ముదిగొండ రాజలింగంగారు మొదలగు అనేకమంది వివిధ రంగాలలో, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినొందినవారు ఉన్నారు.

మన నేటి, నాటి ప్రముఖులనందరిని స్మరించుకుంటూ, మన తరంలోని, మన రాబోయే తరాలలోని కళాకారులను, క్రీడాకారులను,  జిజ్ఞాసులను, ఒౌత్సాహికులను గుర్తించడానికి,  ప్రోత్సహించడానికీ ఈ వేదిక ఉపకరించగలదని భావిస్తూ,
బుధజన విధేయుడు
మల్లంపల్లి సుబ్రహ్మణ్యమ్
🙏🙏🙏

No comments:

Post a Comment